: వైజాగ్ లో భారీ హవాలా రాకెట్...1500 కోట్ల కుంభకోణాన్ని ఛేదించిన ఐటీ శాఖ
విశాఖపట్టణంలో భారీ హవాలా రాకెట్ బట్టబయలైంది. హవాలా రూపంలో 1500 కోట్ల రూపాయలకు పైగా విదేశాలకు డబ్బు తరలించిన ఘటన చోటుచేసుకుంది. గత కొన్నేళ్లుగా బోగస్ కంపెనీలు, తప్పుడు డాక్యుమెంట్లను తయారుచేసి సుమారు 1500 కోట్లకు పైగా డబ్బు నొక్కేసిన ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళంకు చెందిన వడ్డి మహేష్ అనే వ్యక్తి , తన కుటుంబ సభ్యుల పేరుతో విశాఖపట్టణం, శ్రీకాకుళం, కోల్ కతాల్లో షెల్ కంపెనీలు పెట్టినట్టు డాక్యుమెంట్లు సృష్టించి, బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు పొందేవాడు. అనంతరం ఆ డబ్బును సింగపూర్ మీదుగా విదేశాలకు తరలించేవాడు. ఇలా సుమారు 1500 కోట్ల రూపాయలకు పైగా గుటకాయస్వాహా చేయడంతో అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు ఈ రాకెట్ ను ఛేదించినట్టు తెలుస్తోంది.