: పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న 50 మంది హిజ్రాలు


తమిళనాడులో ప్రితికా యాషిన్ అనే ఓ హిజ్రా ఇటీవలే ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికైన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రితికా త‌మిళ‌నాడులోని ధర్మపురిలోని పోలీసు స్టేషన్‌లో పదవీ బాధ్యతలు నిర్వ‌ర్తిస్తున్నారు. దేశంలోనే మొట్ట మొదటి సారి ఎస్ఐ పోస్టును ద‌క్కించుకున్న‌ హిజ్రాగా  పేరు తెచ్చుకున్న  ప్రితికా స్ఫూర్తితో ఈ సారి ఏకంగా 50 మంది హిజ్రాలు పోలీసు ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ నెల  21న  ఆ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల ఎంపిక రాత పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి.  సమాజంలో ఎన్నో అవ‌మానాలు ఎదుర్కునే హిజ్రాలు ప్ర‌ితికా  ఇచ్చిన స్ఫూర్తితో విద్య, ఉపాధి ద్వారా  అభివృద్ధి బాటలో నడుస్తున్నారు. కాగా, త‌మిళ‌నాడులో పోలీసు ఉద్యోగాల‌కు మొత్తం 6.32 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News