: నా ప్రయాణాన్ని అప్‌గ్రేడ్ చేసిన ‘ఆడి’కి ధన్యవాదాలు: కోహ్లీ
తన ప్రయాణాన్ని అప్‌గ్రేడ్ చేసిన ఆడికి ధన్యవాదాలు అంటూ టీమిండియా స్టార్ ఆటగాడు, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రోజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా హర్షం వ్యక్తం చేశాడు. తమ కంపెనీ భారత్‌లో అడుగుపెట్టి పదేళ్లు పూర్తైన సందర్భంగా కోహ్లీకి జర్మనీ కార్ల తయారీ సంస్థ ఆడి తాజాగా తమ క్యూ 7 కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆడీ కార్లంటే ఎంతో ఇష్టపడే కోహ్లీ వద్ద ఇప్పటికే ఐదు ఆడి కార్లున్నాయి. తమ ఆడికార్లను ఎంతో ప్రేమతో కొనుక్కుంటున్న కోహ్లీకి ఆ సంస్థ ఈ సందర్భంగా ఈ బహుమతి అందించింది. తన కొత్త కారుతో దిగిన ఓ ఫొటోను కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
Thanks @AudiIN for upgrading my ride to this stylish beast. Love it