: పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన అమెరికా!
ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్ కు దిమ్మతిరిగేలా అమెరికా పలు ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ముంబైలో బాంబు పేలుళ్లకు ప్లాన్ వేసిన హఫీజ్ సయీద్ కు చెందిన జమాత్-ఉద్-దవా (జేయూడీ), లష్కరే తాయిబా, జమాత్-ఉల్-దవా అల్-ఖురాన్ (జేడీక్యూ), ఐసిస్ సంస్థలపై ఆంక్షలు విధించినట్లు అమెరికా ఈ రోజు తెలిపింది. ఇక ఆ సంస్థలకు నిధులు చేరకుండా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. హయతుల్లా గులాం ముహమ్మద్, అలీ ముహమ్మద్ అబు తురబ్ ఆధ్వర్యంలోని పలు చారిటీ సంస్థలపైన ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొంది.