: నిద్రిస్తుండగా ఇంట్లోకి ప్రవేశించి.. నవవధువు గొంతుకోసి, నిప్పంటించిన దుండగులు


పెళ్లి జరిగిన కొన్ని రోజులకే ఆ ఇంట్లో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కూతురు ఒంటిపై ఉన్న న‌గ‌ల కోసం ప‌లువురు దుండ‌గులు ఆమెను దారుణంగా గొంతుకోసి హ‌త్య‌చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సిన్ హ్వాల్ కాపుర్వా గ్రామంలో ఆశాదేవి(20) అనే ఓ యువ‌తికి రాకేశ్ పటేల్ అనే యువ‌కుడితో గత నెల 24న పెళ్లి జ‌రిగింది. ఈ నెల 7న మెట్టినింటి నుంచి ఆమె పుట్టింటికి వ‌చ్చింది. నిన్న‌ రాత్రి తన పుట్టింట్లోని వెనుక భాగంలో ఆమె నిద్రిస్తుండ‌గా అర్ధరాత్రి సమయంలో ప‌లువురు దుండ‌గులు అక్క‌డికి ప్ర‌వేశించారు.

నిద్రిస్తోన్న‌ ఆమె గొంతుకోసి, ఆమె ఒంటిపై ఉన్న‌ రూ. 2 లక్షల విలువైన నగలను దోచుకున్నారు. అనంత‌రం ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘ‌ట‌న జరిగేట‌ప్పుడు ఆ కొత్త పెళ్లికూతురి కుటుంబ సభ్యులు ఇంటి బయట నిద్రిస్తుండ‌డంతో తెల్లరేవ‌ర‌కు ఈ విష‌యం గురించి వారికి తెలియ‌లేదు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News