: క్షణాల వ్యవధిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు!
అతడు మరికొన్ని క్షణాలు ఆగితే సజీవదహనం అయ్యేవాడు. అయితే, స్థానికులు వెంటనే స్పందించడంతో ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్ నాన్‌చాంగ్‌లో జరిగిన ఈ ఘటన వీడియోను సోషల్ మీడియాలో ఉంచిన 23 గంటల్లోనే 7.9 లక్షల మంది చూశారు. రోడ్డుపై నుంచి మెల్లిగా వెళుతున్న ఓ ట్రక్‌ను బైక్‌పై వేగంగా వచ్చిన ఓ వ్యక్తి ఢీకొన్నాడు. ఆ ట్రక్‌కి దిగువభాగంలో ఉన్న ఆయిల్ ట్యాంక్‌కు బైక్ గట్టిగా తగలడంతో వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో ట్రక్‌తో పాటు బైక్ నడిపిన వ్యక్తికీ ఆ మంటలు అంటుకోగా, వెంటనే స్థానికులు కొంతమంది వచ్చి అతనికి అంటుకున్న మంటలను ఆర్పివేయడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియోను మీరూ చూడండి...