: మీరు జోక్యం చేసుకోండి సార్!: గవర్నర్ ను కోరిన కాంగ్రెస్ నేతలు


టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ను టీ కాంగ్రెస్ నేతలు కలిశారు. అనంతరం ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఖమ్మంలో రైతులకు బేడీలు వేయడాన్ని యావత్ ప్రపంచం ఖండిస్తోందని, రైతులను దేశ ద్రోహులుగా, రౌడీలుగా ప్రభుత్వం చిత్రీకరించిందని అన్నారు. టీఆర్ఎస్ పతనానికి రైతులే నాంది పలుకుతారని అన్నారు. మూడేళ్లుగా రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేసింది శూన్యమని, లక్షన్నర కోట్ల బడ్జెట్ ఉన్నా పంటలను ఎందుకు కొనడం లేదనే విషయాలపై  గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News