: సరికొత్త ఫీచర్లతో.. బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ విడుదల

జపాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ శాన్‌సుయ్ ఈ రోజు మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌పోన్‌ను విడుదల చేసింది. ‘హారిజన్ 2’ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్) సాయంతో ఇంట్లోని ఎలక్ట్రానిక్, ఇతర ఉపకరణాలను సైతం నియంత్రించుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్... యూఎస్‌బీ ఆన్-టు-గో (ఓటీజీ) ద్వారా పెన్‌డ్రైవ్‌లు, ఇతర యాక్సెసరీలను ఉపయోగించుకునే ప్రత్యేకతలను కూడా కలిగి ఉందని చెప్పారు.
‘హారిజన్ 2’ ఫీచర్లు..
2జీబీ ర్యామ్
16 జీబీ అంతర్గత మెమొరీ
ఆండ్రాయిడ్ 7.0 (నౌగట్ ఓఎస్‌ను ఉపయోగించారు)
8 ఎంపీ రియర్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాలు
గ్రే బ్లాక్, రోజ్ గోల్డ్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.4,999.