: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
రెండు రోజులుగా రికార్డుల మోత మోగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 62.83 పాయింట్లు కోల్పోయి 30,188.15 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 21.50 పాయింట్లు నష్టపోయి 9,400.90 వద్ద ముగిసింది. కాగా, ఎన్ఎస్ఈలో హీరో మోటో కార్ప్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా,ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్లు లాభపడ్డాయి. ఎస్ బ్యాంక్, జీ ఎంటర్ టైన్ మెంట్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఇన్ఫ్రాటెల్ షేర్లు నష్టాల బాట పడ్డాయి.