: రేపు రమ్యకృష్ణ ‘మాతాంగి’ ట్రైలర్ విడుదల
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాలో రాజమాత శివగామిగా కనిపించి ‘ఆ పాత్ర ఆమె తప్పా ఇంకెవ్వరూ చేయలేరేమో’ అంటూ ప్రశంసలు అందుకుంటున్న నటి రమ్యకృష్ణ ఇప్పుడు కొత్త సినిమా షూటింగుల్లో బిజీబిజీగా ఉంటోంది. ‘బాహుబలి’ తరువాత ఆమె ‘మాతాంగి’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఆమె కొత్త సినిమా ట్రైలర్ రేపు ఉదయం 10.25కు విడుదల చేస్తామని మాతాంగి సినిమా యూనిట్ ఈ రోజు తెలిపింది. గతంలో దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన అమ్మోరు సినిమాలో అమ్మోరుగా రమ్యకృష్ణ కనిపించిన సంగతి తెలిసిందే. మాతాంగి సినిమా పోస్టర్‌లోనూ రమ్యకృష్ణ అమ్మోరులా తీక్షణమైన కళ్లతో ఉన్న రూపంలో కనపడుతోంది. వినయ కృష్ణన్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి కణ్ణన్ తమరకులం దర్శకత్వం వహిస్తున్నారు.