: ‘బాహుబలి-2’లో ఆ సన్నివేశం చూసి ఏడ్చేశాను: రమ్యకృష్ణ


‘బాహుబలి’లో శివగామి, కట్టప్ప, భల్లాలదేవ, బాహుబలి పాత్రల నటనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివగామి పాత్రధారి రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘బాహుబలి-2’లో తనను కన్నీరు పెట్టించిన సన్నివేశం గురించి చెప్పింది. హైదరాబాద్ లో‘బాహుబలి-2’ చిత్రాన్ని తొలిసారి చూశానని చెప్పింది. ఈ సినిమాలో శివగామి ముందుకు వచ్చి కట్టప్ప పచ్చి నిజాలు చెప్పే సన్నివేశం వచ్చినప్పుడు ఏడ్చేశానని, ఈ సన్నివేశం ఎంతో భావోద్వేగంతో నిండి ఉంటుందని, ఆ సన్నివేశంలో నటించడం తనకు చాలా నచ్చిందని చెప్పింది. 

  • Loading...

More Telugu News