: రోమ్ లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం వద్ద పేలుళ్లు
ఇటలీ రాజధాని రోమ్ లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం వద్ద జంట పేలుళ్లు సంభవించాయి. ఐరాస కార్యాలయం సమీపంలోని పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న పార్కింగ్ లో రెండు కార్ల మధ్య రెండు బాంబులను అమర్చి పేల్చివేశారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించనప్పటికీ... అక్కడున్న చాలా కార్లు ధ్వంసమయ్యాయి. ప్లాస్టిక్ బాక్సులో ఈ బాంబులను అమర్చినట్టు అధికారులు తెలిపారు. పేలుడుతో అప్రమత్తమైన పోలీసులు సమీపంలోని అన్ని ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ పేలుళ్లకు తామే పాల్పడినట్టు ఇంతవరకు ఎవరూ ప్రకటించుకోలేదు.