: టీడీపీ నేతలపై ఎలాంటి కేసులున్నా ప్రభుత్వం ఎత్తివేస్తుంది: వాసిరెడ్డి పద్మ ఆరోపణ
టీడీపీ నేతలపై ఎలాంటి కేసులున్నా ప్రభుత్వం ఎత్తివేస్తుందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్ కోడెలతో పాటు మంత్రులు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, అమర్ నాథ్ రెడ్డి, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావుపై కేసులు ఎత్తి వేశారని ఆరోపించారు. టీడీపీలో చేరిన తర్వాతే భూమా నాగిరెడ్డిపై కేసులు ఎత్తివేశారని, ప్రతిపక్షలో ఉంటే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేసులు మాఫీ చేయడం పెద్దనేరమని, నాడు ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆంధ్రాయూనివర్శిటీలో సమావేశం పెడితే అడ్డుకున్నారని, మరి, టీడీపీ మహానాడును అక్కడ ఎలా నిర్వహిస్తుందని ఆమె ప్రశ్నించారు.