: పెరిగిన బంగారం ధర
అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి ఈ రోజు కొనుగోళ్లు పెరిగిపోవడంతో పసిడి ధర పెరిగింది. నిన్న భారీగా తగ్గిన 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఈ రోజు మాత్రం రూ.150 పెరిగి, రూ.28,550గా నమోదైంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తూ రూ.200 పెరిగి, కిలో వెండి రూ.38,400గా ఉంది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర పైకి ఎగిసిందని విశ్లేషకులు చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర 0.28శాతం పెరిగి ఔన్సు 1,228.20 అమెరికన్ డాలర్లుగా నమోదైంది.