: కర్నూల్ లో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్టు!


ఏపీలో ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో బార్ పేటకు చెందిన ఓ ఇంట్లో యువకులు బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. ఈ మేరకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.1.13 లక్షల నగదు, ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు తెలిపారు.

 కాగా, గుంటూరులో మరో బెట్టింగ్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక విద్యానగర్ లోని ఓ ఇంటిపై గుంటూరు అర్బన్ పోలీసులు దాడి చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న కూరపాటి నాగేశ్వరరావు, దుంపల సుధీర్ ను అరెస్టు చేసి, వారి నుంచి రూ.3.5 లక్షల నగదు, ఏడు సెల్ ఫోన్లు, ఎల్ ఈడీ టీవీ, ఓ ల్యాప్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News