: రెండు రోజుల పాటు లెక్కించిన డబ్బు ఏమైంది?: రేవంత్ రెడ్డి


మిర్చి రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ నిండా ముంచేశారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఆదేశాలతోనే మిర్చి రైతులు రోడ్డున పడ్డారని అన్నారు. తమకు గిట్టుబాటు ధర ఇవ్వాలంటూ రైతులు నిరసన తెలిపితే... వారిని రౌడీలన్నారని, జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 రైతులకు సంకెళ్లు వేసి ప్రజలంతా అవాక్కయ్యేలా చేశారని అన్నారు. దీనికి సంబంధించి మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు క్షమాపణలు చెప్పి, వారిపై కేసులను ఉపసంహరించుకోవాలని అన్నారు. రైతులకు సంకెళ్లు వేసిన అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే... మళ్లీ నయీమ్ కేసును తెరపైకి తెచ్చారని విమర్శించారు. నయీమ్ ఇంట్లో రెండు రోజుల పాటు లెక్కించిన డబ్బు ఏమైందని ప్రశ్నించారు. నయీమ్ తో చేతులు కలిపిన టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News