: మరోసారి మేకప్ వేసుకోనున్న అలనాటి అందాల తార


అలనాటి అందాల తార జయప్రద మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు ఆరేళ్ల పాటు నటనకు దూరంగా ఉన్న ఆమె... తాజాగా ఓ మలయాళ చిత్రంలో నటించబోతున్నారు.  ఈ సినిమా షూటింగ్ కోసం ఆమె ఇప్పటికే కేరళకు చేరుకున్నారు. దర్శకుడు ఎంఏ నిషాద్ తీయబోతున్న 'కిన్నారు' అనే మలయాళ సినిమాలో ఆమె నటించనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో జయప్రద మాట్లాడుతూ తిరిగి నటిస్తుండటం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. నీటి సమస్య, రైతుల సమస్య కథాంశంగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలిపారు. 2011లో ఆమె 'ప్రణయం' అనే మలయాళ చిత్రం చేశారు. ఇందులో మోహన్ లాల్, అనుపమ్ ఖేర్ కూడా నటించారు. 

  • Loading...

More Telugu News