: ఎస్బీఐ ఖాతా ఉందా? ఏటీఎంల నుంచి విత్ డ్రా నిబంధనలివి!
ప్రైమరీ సేవింగ్స్ ఖాతా ఉన్న కస్టమర్లు నెలలో కేవలం నాలుగు సార్లు మాత్రమే ఏటీఎంల నుంచి డబ్బును విత్ డ్రా చేసుకోగలుగుతారని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వెల్లడించింది. ఏటీఎంల నిర్వహణ క్లిష్టమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూ, మెట్రోల్లోని బ్రాంచీల్లో సేవింగ్స్ ఖాతాలున్నవారు ఎస్బీఐ ఏటీఎంలలో 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మూడు సార్లు డబ్బును తీసుకోవచ్చని, ఇతర ప్రాంతాల్లోని బ్రాంచీల్లో ఖాతాదారులు ఎస్బీఐ ఏటీఎంలలో 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో 5 సార్లు డబ్బు తీసుకోవచ్చని, ఆపై విత్ డ్రాలకు రుసుమును వసూలు చేస్తామని స్పష్టం చేసింది. కాగా, ఎస్బీఐ అందిస్తున్న బడ్డీ యాప్ ద్వారా ఏటీఎం విత్ డ్రా సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, యాప్ ద్వారా విత్ డ్రా చేసుకుంటే ఒక్కో లావాదేవీకి రూ. 25 వసూలు చేస్తామని కూడా ఎస్బీఐ స్పష్టం చేసింది.