: 'బాహుబలి-2' ఘన విజయాన్ని తట్టుకోలేకపోతున్న దర్శకులు!


దర్శకదిగ్గజం రాజమౌళి విజువల్ వండర్ 'బాహుబలి-2' అఖండ విజయం సాధించడంతో బాలీవుడ్ సినీ ప్రముఖులంతా ఆ విజయాన్ని తట్టుకోలేకపోయారు. బాలీవుడ్ సాధించలేని రికార్డులను ఓ ప్రాంతీయ భాషా చిత్రం సాధించడం వారిని తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. బాహుబలిని మించిన సినిమాను తీయాలని ఇప్పుడు అక్కడి దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

అయితే, జక్కన్న సినిమా కోలీవుడ్ లో కూడా ఇలాంటి పరిస్థితినే నెలకొల్పింది. తమిళ దర్శకుడు చేరన్ చేసిన ట్వీట్ కోలీవుడ్ ప్రముఖుల మనసులోని ఆలోచనను ప్రతిబింబిస్తోంది. 'బాహుబలి-2'ను మించిన సినిమాను మనం కూడా నిర్మించాలని ట్విట్టర్ ద్వారా చేరన్ పిలుపునిచ్చాడు. దానికి తగ్గ ఎన్నో పౌరాణిక కథలు తమిళంలో కూడా ఉన్నాయని ఆయన అన్నాడు. చేరన్ వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. 

  • Loading...

More Telugu News