: కొడుకుతో పాటు ఆ తండ్రి కూడా తరగతిలో ఎందుకు కూర్చున్నాడో తెలుసా?


కొడుకు కోసం తండ్రి స్కూల్ కు వెళ్లడం సర్వసాధారణం... అయితే తరగతి గదిలో కొడుకుతో పాటు తండ్రి కూడా కూర్చోవడం ఆశ్చర్యకరం. ఇలాంటి ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... టెక్సాస్ లోని ఓ స్కూల్ లో చదువుతున్న బ్రాడ్ హావర్డ్ (17) తెగ అల్లరి చేస్తాడు. పిల్లాడే కదా... అల్లరి మామూలే అనుకుందామంటే... ఫిజిక్స్ టీచర్ క్లాసులో ఈ అల్లరి మరింత హద్దులు దాటుతుంది. ఎన్ని విధాలుగా చెప్పినా అతని అల్లరిలో మార్పు లేకపోవడంతో అతని తండ్రికి ఫిర్యాదు చేశారు.

దీంతో 'మరోసారి స్కూల్ లోని ఫిజిక్స్ టీచర్ నుంచి కంప్లైంట్ వస్తే.... నేను కూడా నీతో వచ్చి స్కూల్ లో కూర్చోవాల్సి ఉంటుంది. దీంతో అల్లరి అన్న మాటకే తావుండదు జాగ్రత్త' అని బ్రాడ్ తండ్రి హెచ్చరించారు. అయినా బ్రాడ్ ప్రవర్తనలో మార్పు లేదంటూ ఫిజిక్స్ టీచర్ మళ్లీ అతని తండ్రికి మెయిల్ చేశారు. అంతే.. కొడుకు ప్రవర్తనలో మార్పు తేవాలని భావించిన అతను...బ్రాడ్ తో కలిసి వెళ్లి తరగతి గదిలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయనతో బ్రాడ్ ఉండడాన్ని ఫోటో తీసిన బ్రాడ్ అక్క మొల్లీ హావర్డ్...తన చిన్న తమ్ముడి నిర్వాకాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో తండ్రిని అంతా అభినందిస్తున్నారు. పిల్లాడి తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News