: ఐపీఎల్-10లో మ్యాచ్ ఫిక్సింగ్... ఇద్దరు గుజరాత్ లయన్స్ ప్లేయర్లపై విచారణ షురూ


ఐపీఎల్ 10వ సీజన్ పోటీలు ముగింపు దశకు వచ్చిన తరుణంలో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ బెట్టింగ్ రాకెట్ బట్టబయలు కాగా, వారు వెల్లడించిన వివరాల ప్రకారం, గుజరాత్ లయన్స్ కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని పోలీసులు గుర్తించి, బీసీసీఐకి సమాచారం ఇచ్చారు. కాన్పూర్ లోని ఓ హోటల్ లో ముగ్గురు బుకీలు వచ్చి ఆటగాళ్లను కలుసుకున్నారని, వారి నుంచి రూ. 40 లక్షలు ప్లేయర్లకు అందాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం ముగ్గురు బుకీలు తమ అదుపులోనే ఉన్నారని, వారి నుంచి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని తెలిపాయి. కాగా, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నామని బీసీసీఐ పేర్కొంది. విచారణ పూర్తయ్యే వరకూ ఆటగాళ్ల పేర్లను బయటకు వెల్లడించబోమని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ వ్యవహారంపై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.

  • Loading...

More Telugu News