: ఆదివారం సంచలన విషయం చెబుతానంటూ మరో బాంబేసిన కపిల్ మిశ్రా
తనను మంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్రమైన ఆరోపణలు చేసి, ఆయన కుంభకోణాలు చేశారని ఆరోపిస్తూ అందుకు ఆధారాలను ఏసీబీ, లెఫ్టినెంట్ గవర్నర్ లకు ఇచ్చానని చెప్పిన కపిల్ శర్మ, నేడు మరో కీలక వ్యాఖ్య చేశారు. ఆదివారం నాడు మరో సంచలన విషయం చెబుతానని అన్నారు. కేజ్రీవాల్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ, చుట్టూ పోలీసుల భద్రత నడుమ నిరాహార దీక్ష చేస్తున్న ఆయన ఈ ఉదయం మీడియాతో మాట్లాడారు. తాను చేసిన ఆరోపణలు నిజం కనుకనే ఇంతవరకూ కేజ్రీవాల్ నోరు మెదపలేదని అన్నారు. కేజ్రీ ఇంత నిశ్శబ్దంగా ఉండటం తానెన్నడూ చూడలేదని, వాటర్ ట్యాంకర్ స్కామ్ తో పాటు, అక్రమంగా నిధులు కూడబెట్టి, ఐదుగురు ఆప్ మంత్రులను ఆయన విదేశాలకు పంపించారని ఆరోపించారు. తనపై దాడి చేయించింది కూడా ఆయనేనని తెలిపారు.