: 'నిషిత్ కారు ప్రమాదం దృశ్యాలను వీడియో తీశా... కొంటారా?' అనడుగుతున్న యువకుడు!


హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మెట్రో పిల్లర్ ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్, ఆయన స్నేహితుడు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. నిషిత్ కారు ప్రమాదానికి గురవుతున్న సమయంలో అక్కడున్న ఓ వ్యక్తి యాదృచ్ఛికంగా ఆ ప్రమాద దృశ్యాలను తన మొబైల్ కెమెరాలో బంధించాడు. అనంతరం, ప్రమాదం జరుగుతున్న సందర్భంగా తీసిన వీడియో తన వద్ద ఉందని... దాన్ని తాను అమ్మాలనుకుంటున్నానని... మీరు కొంటారా? అంటూ ఓ ప్రముఖ తెలుగు మీడియా సంస్థకు ఆయన మెయిల్ చేశాడు. వీడియోకు సంబంధించిన ఆధారాలు చూపించమంటూ సదరు మీడియా సంస్థ అతనికి రిప్టై ఇచ్చింది. దీంతో, ప్రమాదానికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను తీసి పంపాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయం ఇంకా తెలియరాలేదు.

  • Loading...

More Telugu News