: యూఎస్ లో మ్యాసివ్ పోలీస్ ఆపరేషన్... 21 దేశాలకు చెందిన వందలాది మంది అరెస్ట్


అమెరికాలో డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ విభాగం జరిపిన అతిపెద్ద ఆపరేషన్ లో భాగంగా, ఆసియా, ఆఫ్రికా, యూరప్, కరేబియన్ ప్రాంతాల్లోని 21 దేశాలకు చెందిన 445 మంది సహా 1,378 మందిని అరెస్ట్ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. డ్రగ్ ట్రాఫికింగ్, ఆయుధాల స్మగ్లింగ్, అక్రమంగా ప్రవేశించడం, హత్యలు చేయడం, లైంగిక నేరాలకు పాల్పడటం వంటి అభియోగాలతో వీరిని అరెస్ట్ చేశామని డీహెచ్ఎస్ అధికారులు వాషింగ్టన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు.

అరెస్ట్ అయిన వారిలో 900 మందికి పైగా అమెరికన్లు ఉన్నారని తెలిపారు. మార్చి 26 నుంచి మే 6 మధ్య వీరిని అదుపులోకి తీసుకున్నామని, దేశ భద్రతకు ప్రమాదంగా మారినందునే వీరిని అరెస్ట్ చేశామని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ థామస్ హోమన్ వెల్లడించారు. మెక్సికోకు చెందిన 249 మంది, ఎల్ సాల్వెడార్ కు చెందిన 72 మంది, హోండురాస్ కు చెందిన 63 మంది, గాటెమాలాకు చెందిన 19 మంది, డొనిమికన్ రిపబ్లిక్ కు చెందిన 10 మంది క్యూబాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఈక్వెడార్, కోస్టా రికా, కొలంబియా, నికరాగ్వా, బ్రెజిల్, మార్షియానా, లావోస్, జమైకా దేశాల వాసులూ పట్టుబడిన వారిలో ఉన్నారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News