: ఒక కుటుంబం అన్నాక ఇలాంటివన్నీ సహజం: ఎంపీ మాగంటి బాబు


తమ అధినేత చంద్రబాబుపై తనకు ఏమాత్రం కోపం లేదని టీడీపీ ఎంపీ మాగంటి బాబు అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలకు కూడా తాను హాజరుకావడం లేదన్న వార్తల్లో కూడా వాస్తవం లేదని ఆయన తెలిపారు. స్థానిక నేతలకు కూడా అవకాశం కల్పించాలనేదే తన ఆలోచన అని... అందుకే తాను వేదిక ఎక్కడం లేదని చెప్పారు. ఇతర ఎమ్మెల్యేలతో సైతం తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. అయినా, ఒక కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు ఉండటం సహజమేనని చెప్పారు. డబ్బు ఖర్చు చేసే తాము ఎన్నికల్లో గెలిచామని అన్నారు. పోలవరం భూసేకరణలో గతంలో అవకతవకలు చోటుచేసుకున్న విషయం వాస్తవమేనని... అయితే, ఈ అవకతవకలను అధికారులు సరి చేస్తున్నారని చెప్పారు.


  • Loading...

More Telugu News