: మరికొన్ని గంటల్లో ప్రపంచ వినాశనం మొదలవుతుంది: ప్రఖ్యాత జ్యోతిష్కుడు ప్రమోద్ గౌతమ్


మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు జ్యోతిష్కులు జోస్యం చెబుతున్నారు. మన దేశానికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు ప్రమోద్ గౌతమ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మరికొన్ని గంటల్లో ప్రపంచ వినాశనం మొదలుకానుందని ఆయన జోస్యం చెప్పారు. మే 13వ తేదీ నుంచి మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభంకానుందని ఆయన తేల్చి చెప్పారు.

అమెరికాను కాపాడుకునే ప్రయత్నంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత తీవ్రమైన చర్యలకు దిగుతారని ఆయన అన్నారు. ఈ క్రమంలో తూర్పు నుంచి పశ్చిమం వరకు ప్రపంచం మొత్తం కకావికలమవుతుందని చెప్పారు. మరోవైపు, అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తాడంటూ గతంలో గౌతమ్ జోస్యం చెప్పారు. దీంతో, ప్రస్తుతం ఈయన చెబుతున్నదాన్ని ప్రపంచ మీడియా హైలైట్ చేస్తోంది. ఇంతకుముందే అమెరికాకు చెందిన ఓ ప్రముఖ జ్యోతిష్కుడు కూడా జూన్ 14వ తేదీ నుంచి మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని చెప్పిన సంగతి తెలిసిందే.

మరోవైపు తన శిష్యులతో కలసి ఆగ్రాలోని యమునా తీరంలో ప్రమోద్ గౌతమ్ మహా శాంతి హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హోమం ద్వారా యమున సోదరుడు, మృత్యువుకు అధిపతి అయిన యమధర్మరాజును ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశామని... తద్వారా యుద్దాన్ని నివారించేందుకు తమవంతు ప్రయత్నం చేశామని చెప్పారు.

  • Loading...

More Telugu News