: జూబ్సీహిల్స్ చెక్ పోస్టు నుంచి 9వ మెట్రో పిల్లర్... ఓన్లీ 5 సెకండ్స్!


రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో ఘోర ప్రమాదానికి గురైన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్, కారు నడిపిన విధానాన్ని సీసీటీవీ కెమెరాల నుంచి సేకరించిన వివరాలతో పోలీసులు విశ్లేషించారు. రవాణా అధికారులతో కలసి నమూనా ప్రమాద ఘటనను సృష్టించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు సిగ్నల్స్ నుంచి అత్యంత వేగంతో దూసుకెళ్లిన ఈ కారు కేవలం 5 సెకన్లలోనే 9వ నంబర్ పిల్లర్ ను ఢీకొట్టిందని తేల్చారు.

ముందు వెళుతున్న వాహనాలను ఓవర్ టేక్ చేసుకుంటూ నిషిత్ కారు ప్రయాణించిందని చెప్పేందుకు ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్ లోని సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించారు. నిషిత్ కారు మెట్రో స్తంభం వైపు ఎలా వెళ్లింది? ఎందుకు వెళ్లిందన్న విషయాన్ని ఈ నమూనా ప్రమాదంతో శాస్త్రీయంగా నిర్థారించారు. తమ సమగ్ర దర్యాఫ్తులో భాగంగా, ప్రతి చిన్న విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించామని పోలీసు వర్గాలు తెలిపాయి.

జూబ్సీహిల్స్ ప్రాంతంలో నిర్మితమవుతున్న మెట్రో మార్గంలో 7, 17 పిల్లర్ ల మధ్య ప్రమాద అవకాశాలు అధికంగా ఉన్నాయని, ఇక్కడ పిల్లర్లకు రేడియం స్టిక్కర్లు కూడా అంటించి లేవని గమనించామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇక్కడ ప్రమాద హెచ్చరికల బోర్డును తక్షణమే ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News