: నిషిత్ కారు ప్రమాదంపై విచారణ షురూ.. రంగంలోకి దిగిన క్లూస్ టీం


ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ కారు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. గురువారం పోలీసులు, క్లూస్ టీం సిబ్బంది హైదరాబాద్  జూబ్లీహిల్స్‌లోని ఘటనా స్థలాన్ని సందర్శించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైనా కారు సాంకేతిక వైఫల్యాలపైనా దర్యాప్తు చేస్తున్నారు. నిషిత్ నడుపుతున్న కారులో అత్యాధునిక రక్షణ వ్యవస్థ వుందని, బ్రేక్ వేస్తే క్షణాల్లోనే ఆగిపోతుందని బెంజ్ నిపుణులు చెబుతున్నారు.

అలాగే చిన్నపాటి ప్రమాదం జరిగినా కారులోని 8 బెలూన్లు తెరుచుకుంటాయని అంటున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారులోని బెలూన్లూ సరిగా తెరుచుకోలేదు, బ్రేకులూ సరిగా పడలేదని సీసీటీవీ ఫుటేజీల ద్వారా తెలుస్తోంది. దీంతో ఈ విషయంపై దృష్టిసారించిన క్లూస్ టీం మరింత సమాచారాన్ని సేకరించే పనిలో పడింది.

  • Loading...

More Telugu News