: విమానంలో వాళ్లిద్దరూ చితక్కొట్టుకున్నారు.... వీడియో చూడండి
మామూలుగా ఎర్రబస్సుల్లో సీట్ల కోసం జరిగే జగడాలు ఈ మధ్య కాలంలో విమానాల్లో కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం డల్లాస్ నుంచి ఆక్లాండ్ కు వెళ్తుండగా ఇద్దరు ప్రయాణికులు ముష్టి ఘాతాలకు దిగిన వైనం వెలుగు చూసింది.
ఈ విమానం మార్గమధ్యంలో కాలిఫోర్నియాలోని బర్బంక్ బాబ్ హోప్ ఎయిర్ పోర్టులో ఆగింది. ప్రయాణికులు కిందకు దిగుతుండగా ఇద్దరు యువకులు ఘర్షణకు దిగారు. అంతకు ముందు సీట్ విషయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే కిందికి దిగుతున్న క్రమంలో వారిద్దరూ ఒక్కసారిగా కలబడ్డారు. ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు.
దీనిని చూసి ఆపేందుకు వచ్చిన ప్రయాణికులను కూడా వారు కనికరించలేదు. అమాంతం వారితోపాటు ప్రత్యర్థిని సీట్ల కింద పడేసిన ఓ యువకుడు, ప్రత్యర్థిపై పిడిగుద్దులు కురిపించాడు. దీనిని వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఇది వైరల్ గా మారింది. దీనిపై విమాన సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.