: దారుణం.... బతికుండగానే యువతిని పూడ్చిపెట్టారు... వీడియో చూడండి
బీహార్ లో దారుణం చోటుచేసుకుంది...ప్రాణాలతో ఉండగానే 19 ఏళ్ల యువతిని పూడ్చి పెట్టిన దారుణం గోవిందపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే...స్థానిక వ్యాపారి అమిత్ షా.. బాధిత యువతి తల్లిదండ్రులు సంజన, అన్సారీలను వారి స్థలంలో ఓ భవనం కడతానని ప్రతిపాదించాడు. దానికి వారు అంగీకరించలేదు. దీనిపై గతంలో పలు మార్లు అమిత్ షా వారిని బెదిరించాడు. ఆ బెదిరింపులను వారు పట్టించుకోకపోవడంతో....వారి ఇంటిపై దాడి చేసిన ఇద్దరు దుండగులు... వారిని హెచ్చరించేందుకు ఇంట్లో ఉన్న వారి కుమార్తె ఖుష్బూ (19)ను కొట్టి, బలవంతంగా లాక్కెళ్లి దగ్గర్లో ఉన్న 3 అడుగుల గుంతలో పూడ్చిపెట్టారు.
ఖుష్బూ ఇంట్లో కనిపించకపోయేసరికీ అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం చుట్టుపక్కల వెతికారు. ఇంతలో అక్కడ కొత్తగా గుంత కనిపించడంతో దానిని తవ్వి చూడగా ఖుష్బూ స్పృహ కోల్పోయి కనపడింది. దీంతో గ్రామస్థులతో పాటు కుటుంబ సభ్యులు ఆమెకు స్పృహ తెప్పించేందుకు చాలా ప్రయత్నించారు. షాక్ కు గురైన ఖుష్బూ కోలుకోకపోవడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి, అమిత్ షాపై పోలీసులకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఖుష్బూను గుంత నుంచి తీస్తున్న వీడియోను వారు పోలీసులకు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.