: ట్రంప్ కంటే నేనే సూపర్.. వచ్చే ఎన్నికల్లో బరిలోకి.. హాలీవుడ్ నటుడు డ్వెయిన్ జాన్సన్


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే తానే బాగా పనిచేస్తానని, వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రముఖ హాలీవుడ్ నటుడు, మాజీ రెజ్లర్ డ్వెయిన్ జాన్సన్ అన్నాడు. అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉండడం మామూలు విషయం కానప్పటికీ తనకు మాత్రం అది సాధ్యమయ్యే పనేనని పేర్కొన్నాడు. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తానెవరికీ ఓటేయలేదని పేర్కొన్నాడు. కానీ తాను అధ్యక్షుడినైతే ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తానని, తనను వ్యతిరేకించే వారిపట్ల కూడా తప్పుగా ప్రవర్తించబోనని పేర్కొన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అధ్యక్షుడిగా ట్రంప్ కంటే తానే బాగా చేస్తానని చెప్పుకొచ్చాడు.  ప్రస్తుతం డ్వెయిన్ ‘బేవాచ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News