: అభ్యంతరకరమైన జాబితాలో మోదీ పేరు.. గూగుల్‌పై కేసు


ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌పై ఉత్తరప్రదేశ్‌లో కేసు నమోదైంది. 2015లో ప్రధాని నరేంద్రమోదీ పేరును అభ్యంతరకర జాబితాలో పెట్టిందన్న ఆరోపణలపై ఈ కేసును నమోదు చేశారు. న్యాయవాది నందకిషోర్ ఫిర్యాదు మేరకు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు షాజహాన్‌పూర్ ఎస్పీ కమల్ కిషోర్ తెలిపారు. 2015లో జాతీయ వార్తల కోసం తాను గూగుల్‌లో సెర్చ్ చేస్తుండగా ప్రధాని మోదీ పేరు అభ్యంతరకమైన జాబితాలో కనిపించిందని నందకిషోర్ తెలిపారు.

  • Loading...

More Telugu News