: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.... ఐదుగురి మృతి


హైదరాబాదు సమీపంలోని షాద్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ బైపాస్ రహదారి 44పై ఈ ప్రమాదం జరిగింది. ఆ వివరాలలోకి వెళితే, కర్నూలు జిల్లా గూడూరుకు చెందిన సోమన్నకు ఇటీవల కాలు విరిగింది. అతనికి చికిత్స కోసం షాద్ నగర్ వచ్చిన సోమయ్య కుటుంబం తిరుగు ప్రయాణంలో మెదక్ జిల్లా చేవెళ్లకు చెందిన మల్లేష్ కారును బాడుగకు మాట్లాడుకుని బయల్దేరారు. రంగారెడ్డి జిల్లా నందిగామ దగ్గరకు రాగానే అప్పుడే రోడ్డు పక్కన ఆగిన లారీని వీరి కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సోమన్న కుటుంబానికి చెందిన నలుగురితోపాటు, డ్రైవర్ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  

  • Loading...

More Telugu News