: ‘రైతులకు బేడీలు’పై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.. ఇద్దరు ఏఆర్ ఎస్ఐల సస్పెన్షన్!


ఖమ్మం మిర్చి యార్డు ఘటనలో బెయిల్ నిమిత్తం కోర్టుకు హాజరైన రైతులకు బేడీలు వేసి ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. విచారణాధికారిగా డీసీపీ సాయికృష్ణను నియమించింది. కాగా, ఈ కేసులో ఇద్దరు ఏఆర్ ఎస్ఐలు వెంకటేశ్వరరావు, పున్నానాయక్ లపై సస్పెన్షన్ వేటు పడింది. 

  • Loading...

More Telugu News