: నయీమ్ కేసుతో లింక్ ఉన్న పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు!
గ్యాంగ్ స్టర్ నయీమ్ తో సంబంధాలున్న పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. సీఐడి ఏఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు, మీర్ చౌక్ ఏసీపీ మలినేని శ్రీనివాసరావు, కొత్తగూడెం ఇన్ స్పెక్టర్ రాంగోపాల్, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ మస్తాన్ పై వేటు పడింది. మరో నలుగురు అధికారులు మహబూబ్ నగర్ డీటీసీ సాయిమనోహర్, ఇల్లందు డీఎస్పీ ప్రకాశరావు, జెన్ కో డీఎస్పీ వెంకట నర్సయ్య, గద్వాల్ ఇన్ స్పెక్టర్ వెంకటయ్యపై మౌఖిక విచారణకు, మరో పదహారు మంది పోలీసు అధికారులపై చర్యలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.