: రేటింగ్ ఏజెన్సీలపై మండిపడ్డ ప్రధాన ఆర్థిక సలహాదారు!
ప్రపంచ రేటింగ్ ఏజెన్సీలపై కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో వీకేఆర్వీ మెమోరియల్ లెక్చర్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం పెరుగుదల, ప్రస్తుత ఖాతా పనితీరు విషయంలో స్పష్టమైన మెరుగుదల ఉన్నప్పటికీ, భారత్ కు ‘బీబీబీ‘ రేటింగ్ ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అదే విధంగా, చైనా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేనప్పటికీ ‘ఏఏ’ రేటింగ్ అప్ గ్రేడ్ చేస్తున్నారని ఆరోపించారు. రేటింగ్ ఏజెన్సీలు పూర్ స్టాండర్డ్స్ తో వ్యవహరిస్తున్నాయని, భారత్, చైనా దేశాలకు రేటింగ్ విషయంలో విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఈ తరహా రేటింగ్ లను సీరియస్ గా ఎందుకు తీసుకోవాలంటూ విశ్లేషకులను ఆయన ప్రశ్నించారు.