: ప్రధానిని జగన్ కలిస్తే తప్పేంటి?: మంత్రి అచ్చెన్నాయుడిపై మండిపడ్డ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్ జగన్ కలిసిన విషయమై ఆరోపణలు గుప్పిస్తున్న టీడీపీ నేత అచ్చెన్నాయుడిపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. విజయవాడలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ, వైఎస్ జగన్ కేసుల గురించి మాట్లాడుకోవడం మంత్రి అచ్చెన్నాయుడు చూశారా? అని ప్రశ్నించారు.
మోదీపైన, జగన్ పైన ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులు తమ స్థాయిని తగ్గించుకోవద్దని హితవు పలికారు. జగన్ కేసుల గురించి మాట్లాడుకున్నామని అచ్చెన్నాయుడుకి మోదీ చెప్పారా? అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో షరతులు లేకుండా మద్దతు తెలపడంలో తప్పేంటని, ప్రధానిని జగన్ కలిస్తే తప్పేంటని టీడీపీ నాయకులను విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు.