: ట్రిపుల్ తలాక్ కేసు.. ఐదు మతాల న్యాయమూర్తుల పరిశీలన!


ముస్లిం మత సంప్రదాయం ప్రకారం, భర్తమూడు సార్లు ‘తలాక్’ చెబితే భార్యకు విడాకులు ఇచ్చేసినట్టే. అయితే, ఈ సంప్రదాయానికి రాజ్యాంగ నిబద్ధత ఉందా? లేదా? అనే అంశంపై సుప్రీం కోర్టు విచారణ మొదలైంది. ‘తలాక్’ సంప్రదాయాన్ని కొనసాగించాలా? లేక నిషేధించాలా? అనే అంశంపై ఓ నిర్ణయం తీసుకోవడం అంత తేలిక కాదు. కనుక, ఈ కేసును ఐదు మతాలకు చెందిన న్యాయమూర్తులతో పరిశీలిస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ నేతృత్వంలో ఈ ధర్మాసనం ట్రిపుల్ తలాక్ అంశాన్ని విచారిస్తోంది. న్యాయమూర్తుల్లో జస్టిస్ ఖేహర్ (సిక్కు), జస్టిస్ కురియన్ జోసెఫ్ (క్రైస్తవ), జస్టిస్ రోహింటన్ ఫారీ నారీమన్ (పార్సీ), జస్టిస్ అబ్దుల్ నజీర్ (ముస్లిం), జస్టిస్ యూయూ లలిత్ హిందూ మతస్తులు.

  • Loading...

More Telugu News