: శ్రీలంక బయల్దేరిన ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంకకు బయలుదేరి వెళ్లారు. గత రెండేళ్లలో ఆయన శ్రీలంక వెళ్లడం ఇది రెండోసారి. రేపు బౌద్ధులు నిర్వహించనున్న అంతర్జాతీయ వేసక్ ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా బౌద్ధ గురువులు, స్కాలర్లు, వివిధ దేశాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. తన పర్యటన గురించి శ్రీలంకకు బయల్దేరే ముందు మోదీ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య మైత్రీబంధానికి తన పర్యటనే నిదర్శనమని చెప్పారు. ప్రపంచ వారసత్వ సంపద అయిన అనురాధపుర నగరాన్ని దర్శించే అవకాశం రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. తన పర్యటనలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానమంత్రితో మోదీ చర్చలు జరపనున్నారు.