: రైతులకు సంకెళ్లపై మండిపడ్డ ఖమ్మం పోలీస్ కమిషనర్


ఖమ్మం మిర్చి యార్డు ఘటనలో బెయిల్ నిమిత్తం కోర్టుకు హాజరైన రైతులకు సంకెళ్లు వేసి ఉండటంపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం నగర పోలీస్ కమిషనర్ ఇక్బాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. కాగా, రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకువచ్చిన సంఘటనను రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనలో మొత్తం పది మంది రైతులకు ఖమ్మం జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక కేసుకు సంబంధించి ఈ నెల 8వ తేదీన, మరో రెండు కేసులకు సంబంధించి ఈ రోజున ఆ రైతులకు బెయిల్ మంజూరు అయింది.

  • Loading...

More Telugu News