: పాప్ సింగర్ జస్టిన్ బీబర్ భారత్ నుంచి వెళ్లిపోయాడా?
భారత పర్యటనకు వచ్చిన పాప్ స్టార్ జస్టిన్ బీబర్ కనిపించడం లేదట. వరల్డ్ టూర్ లో భాగంగా ముంబైకి వచ్చిన బీబర్ బుధవారం రాత్రి డీవై పటేల్ స్టేడియంలో ప్రదర్శన ఇచ్చాడు. మొత్తంమీద మూడు రోజుల పాటు భారత్ లో ఈయన పర్యటించాల్సి ఉంది. ఢిల్లీ, జైపూర్ నగరాల్లో పర్యటించడంతో పాటు ఆగ్రాలోని తాజ్ మహల్ అందాలను చూడటం కూడా బీబర్ ప్లాన్ లో ఉన్నాయి.
కానీ, నిన్న రాత్రి ప్రదర్శన అయిపోగానే బీబర్ భారత్ వదిలి వెళ్లిపోయాడట. ముంబైలో ఉన్న వేడిని బీబర్ భరించలేక పోయాడట... ఆ వేడివల్ల పాటలను కూడా సరిగా పాడలేకపోయాడట. అభిమానులు సైతం బీబర్ ప్రదర్శన పట్ల నిరాశ చెందినట్టు సమాచారం. మరి కారణం ఏంటో సరిగా తెలియదు కానీ... ప్రదర్శన ముగిసిన వెంటనే బీబర్ భారత్ వదిలి వెళ్లిపోయాడని సమాచారం. అయితే ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎక్కడకు వెళ్లాడనే విషయం మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు.