: ప్రేక్షకుల మధ్య కూర్చుని ‘బాహుబలి-2’ చూసిన రజనీకాంత్!


బాహుబలి-2 చిత్రాన్ని ప్రేక్షకుల మధ్యలో కూర్చుని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల వీక్షించారు. చెన్నైలోని సత్యం మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ లో ఈ సినిమా చూసేందుకు, ఆయన అందరికంటే ముందుగానే థియేటర్ లోకి వెళ్లి కూర్చున్నారట. అయితే, తమ మధ్య కూర్చుని ‘బాహుబలి-2’ను రజనీ చూసిన విషయం ఆ థియేటర్లోని ప్రేక్షకులకు మాత్రం తెలియదు. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు, రజనీ అభిమానులు ఆనందంతో పాటు ఆశ్చర్యమూ వ్యక్తం చేశారు. కాగా, ‘బాహుబలి-2’పై రజనీకాంత్ ఇప్పటికే ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్స్ చేశారు.

  • Loading...

More Telugu News