: రైతుల చేతులకు సంకెళ్లు చూసి చలించిపోయిన ఎమ్మెల్యే సండ్ర!


ఖమ్మం మిర్చి యార్డు ఘటనకు సంబంధించిన కేసులో రైతుల చేతికి సంకెళ్లు వేసి ఉండటాన్ని చూసి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చలించిపోయారు. ఈ రోజు ఖమ్మం కోర్టులో సదరు రైతులకు బెయిల్ మంజూరుపై విచారణ నిమిత్తం హాజరు పరిచారు. జిల్లా జైలు నుంచి కోర్టుకు తీసుకువచ్చిన రైతుల చేతులకు సంకెళ్లు వేసి ఉన్నాయి. ఆ రైతులను పరామర్శించేందుకు వచ్చిన సండ్ర వెంకట వీరయ్య, వారి చేతులకు బేడీలు ఉండటం చూసి ఆవేదన చెందారు. కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News