: మేడమ్ టుస్సాడ్స్ లో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్
ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ లో భారతీయ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గొప్ప వ్యక్తుల సరసన తన విగ్రహాన్ని పెట్టడం తనకు ఎంతో గర్వకారణమని చెప్పారు. తన జీవితంలో ప్రతిక్షణం క్రెకెట్ నే శ్వాసించానని అన్నారు. 58 ఏళ్ల వయసులో తన మైనపు విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఈ విగ్రహాన్ని తయారు చేయడం కోసం తన నుంచి 300 రకాలుగా కొలతలు తీసుకోవడం చాలా బాగా అనిపించిందని తెలిపారు. 1983 వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు కపిల్ దేవ్ కెప్టెన్ గా వ్యవహరించారు.