: సోనియాగాంధీని మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం: డాక్టర్ల ప్రకటన
ఫుడ్ పాయిజనింగ్ తో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని గంగారామ్ ఆసుపత్రి ఛైర్మన్ రానా మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె కోలుకుంటున్నారని, మరో రెండు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.
ఈ మధ్య కాలంలో సోనియా గాంధీ పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. డీహైడ్రేషన్, జ్వరం కారణంగా గత ఏడాది ఆమె ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత వారణాసిలో రోడ్ షో సందర్భంగా ఆమె భుజానికి గాయం అయింది. దీంతో, ఆమె భుజానికి సర్జరీ చేశారు. నవంబర్ లో కూడా జ్వరం కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే అనారోగ్య కారణాలతో ఆమె అమెరికా వెళ్లి వచ్చారు.