: రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలతో బయటపడ్డ ప్రముఖులు!


చేతిలో ఖరీదైన కార్లు, చుట్టూ అనుచరగణం ఉండే ఎంతో మంది ప్రముఖులు కారు ప్రమాదాల్లో మరణించిన ఘటనల నేపథ్యంలో, రోడ్డు ప్రమాదాలకు గురై కూడా ప్రాణాలతో బయటపడిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. గతంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళుతుండగా, ఘాట్ రోడ్డులో ఆయన వాహనం పెను ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో బయటపడ్డారు.

 ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని హైదరాబాద్ తిరిగి వస్తున్న వేళ, వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పగా, జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలయ్యాయి. ఆసుపత్రిలో ఆయన కొన్ని వారాలు ఉండాల్సి వచ్చింది. అదృష్టం కొద్దే ఆ ప్రమాదం నుంచి ఎన్టీఆర్ బయటపడ్డారని అప్పట్లో పలువురు వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి కూడా తీవ్ర రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. కడప జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న సఫారీ వాహనాన్ని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనగా, స్వల్ప గాయాలతో వివేకా ప్రాణాలను కాపాడుకున్నారు. పెద్ద యాక్సిడెంట్లు జరిగినా ప్రాణాలు మిగలడం, కొన్నిసార్లు చిన్నపాటి యాక్సిడెంట్లలోనే ప్రాణాలు పోవడం విధిరాతేనేమో!

  • Loading...

More Telugu News