: అమరావతికి వచ్చిన యూపీ మంత్రి సిద్ధార్థనాథ్... కామినేనితో ప్రత్యేక చర్చలు
ఈ ఉదయం ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖా మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ అమరావతికి వచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న వైద్య విధానం, రోగులకు అందుతున్న సేవలు, అత్యాధునిక సౌకర్యాలు తదితరాలపై పరిశీలించాలని సీఎం ఆదిత్యనాథ్ సూచన మేరకు ఆయన అమరావతికి వచ్చారు. సిద్ధార్థనాథ్ కు స్వాగతం పలికిన ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఆయనతో ప్రత్యేక చర్చలు జరిపారు. వైద్య విధానంపై వివరించిన ఆయన రాష్ట్రంలో అమలవుతున్న చంద్రన్న బీమా, హెల్త్ కార్డుల విధానం తదితరాలపై వివరాలను అందించారు. ఈ సాయంత్రం యూపీ మంత్రి కొన్ని ఆసుపత్రులను సందర్శించి అక్కడి అధునాతన పరికరాల పనితీరును సమీక్షించనున్నారు.