: రాజమౌళి 'మహాభారతం'... నటీనటులు వీరే... సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న టీజర్!


తాను ఇప్పట్లో మహాభారతంను తెరకెక్కించడం లేదని, అందుకు చాలా సమయం పడుతుందని దర్శకుడు రాజమౌళి ఓపక్క చెబుతున్నప్పటికీ... మరోపక్క తాజాగా ఓ న్యూస్ పుట్టుకొచ్చింది. రాజమౌళి బాలీవుడ్ లో మహాభారత్ ను తెరకెక్కించనున్నాడని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మేరకు టీజర్ కూడా హల్ చల్ చేస్తోంది. మహాభారత్ లో నటీనటులను కూడా రాజమౌళి సెలెక్ట్ చేశాడని ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ మహాభారత్ లో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అమీర్ ఖాన్, అజయ్ దేవగణ్, హృతిక్ రోషన్, ప్రభాస్, ఫర్హాన్ అఖ్తర్, దీపికా పదుకునే నటించనున్నారని చెబుతోంది. మాహిష్మతి సామ్రాజ్యంలో భాగమైన శివగామి, దేవసేన, కట్టప్పలకు ఈ సినిమాలో స్థానం దక్కలేదు. ఇక పాత్రల విషయంలోకి వస్తే.....
ద్రోణాచార్యుడిగా...రజనీకాంత్
భీష్మాచార్యుడిగా...అమితాబ్ బచ్చన్
శ్రీకృష్ణ  పరమాత్మగా... అమీర్ ఖాన్
దుర్యోధనుడిగా....అజయ్ దేవగణ్
కర్ణుడిగా... హృతిక్ రోషన్ లేదా మహేష్ బాబు
అర్జునుడిగా...ఫర్హాన్ అఖ్తర్
భీమసేనుడిగా... ప్రభాస్
ద్రౌపదిగా...దీపికా పదుకునే తదితరులు నటించనున్నట్టు ఈ టీజర్ లో చూపించారు. ఈ టీజర్ వైరల్ అవుతోంది. కాస్టింగ్ కూడా ఆకట్టుకునేలా ఉందని...భారతీయ సినీ పరిశ్రమలో ఉద్దండులతో ఈ సినిమా మరో అద్భుతం సాధిస్తుందని పలువురు పేర్కొంటున్నారు. దీనిని ఎవరు సృష్టించారో గానీ, పలువుర్ని ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News