: బహుభార్యత్వంపై చెప్పొద్దు... తలాక్ గురించి మాత్రమే మాట్లాడండి... సుప్రీం కీలక రూలింగ్


దేశవ్యాప్తంగా కోట్లాది మంది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీంకోర్టు ఈ ఉదయం విచారణను ప్రారంభిస్తూనే కీలక రూలింగ్ ను ఇచ్చింది. ముస్లిం సమాజంలో అమలవుతున్న తలాక్ అంశం రాజ్యాంగపరంగా చెల్లుబాటు అవుతుందా? లేదా? అన్న విషయంలోనే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తాం తప్ప, బహుభార్యత్వంపై తాము విచారించబోమని తేల్చి చెప్పింది.

నోటితో 'తలాక్' అని మూడుసార్లు చెప్పడంపైనే వాదనలు వినిపించాలని పేర్కొంది. ముస్లిం సమాజంలో ట్రిపుల్ తలాక్ ఓ హక్కుగా భావించాలా? వద్దా? అన్న విషయంలోనే తమ తీర్పు ఉంటుందని జస్టిస్ కేహార్ వ్యాఖ్యానించారు. వరుసగా ఆరు రోజుల పాటు విచారణలు వింటామని, మూడు రోజుల పాటు తలాక్ ను చాలెంజ్ చేస్తున్న వారి వాదనలను, మరో మూడు రోజులు సమర్థిస్తున్న వారి వాదనలనూ వింటామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News