: పవన్ పై వ్యాఖ్యలు చేసిన అశోక్ గజపతిరాజుపై జనసేన ఆగ్రహం!


పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై జనసేన నేతలు, కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. పవన్ ఎవరో తెలియదని అశోక్ గజపతిరాజు చెప్పడం సిగ్గు చేటని జనసేన నేత పోతిన వెంకట మహేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 2014 ఎన్నికల్లో అశోక్ ఎంపీగా గెలిచేందుకు పవన్ కల్యాణే కారణమని ఆయన అన్నారు. అంతకు ముందు ఎన్నికల్లో ఆయనను విజయనగరం ప్రజలు చిత్తుగా ఓడించిన సంగతిని రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని కోరారు. అశోక్ గజపతిరాజులో రాచరికపు అహంభావ పోకడలు ఇంకా పోలేదని మహేష్ మండిపడ్డారు. పవన్ పై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే... రాష్ట్ర ప్రజలు ఆయనకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.  

  • Loading...

More Telugu News